సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘం కార్యాలయం నందు నేడు, బుధవారం జాయింట్ కలెక్టర్ మరియు పురపాలక సంఘ కమిషనర్ వార్ల ఆధ్వర్యంలో పురపాలక సంఘం పరిధిలో పారిశుద్ధ్యం మరియు ఘన వ్యర్ధాలు నిర్వహణపై ప్రజా ఆరోగ్య సిబ్బంది తో రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ నందు జాయింట్ కలెక్టర్ వారు ఘన వ్యర్థాల నిర్వహణ మరియు ప్లాస్టిక్ వాడకంపై ఆదేశాలు జారీ చేసారు. వారి ఆదేశాల మేరకు.. భీమవరం పురపాలక సంఘం పరిధిలో 120 మైక్రాన్లకన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ సంచుల వాడకంపై నిషేధం ఉన్న కారణంగా వ్యాపారస్తులు లేదా వినియోగదారుల ప్లాస్టిక్ వాడకడ తగ్గించుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయదమైనది. నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ ను వినియోగించిన వారికి పెనాల్టీలు విధించడం వలసిందిగా ఆదేశాలు జరిచేయడమేంది.సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేదా ప్లాస్టిక్ వస్తువులపై తయారీ లేదా విక్రయదారులే సదరు ప్లాస్టిక్ వ్యర్థాల పునర్వినియోగం చేయడం లేదా శాస్త్రీయ పద్ధతిలో వాటిని ప్రోసెస్ చేయు విధానంలో ప్రథమ బాధ్యతను కలిగి ఉంటారని తెలియజేయడమైనది. కావున పై ఆదేశాల ప్రకారం రానున్న 12 రోజుల్లోపు పట్టణంలో క్రయవిక్రయాలు జరుపు దుకాణదారులు దీనిని అమలు చెయ్యాలి. తదుపరి రోజు నుండి పురపాలక సంఘం వారు తనిఖీలు జరిపితే నిబంధన విరుద్ధంగా ప్లాస్టిక్ వ్యర్థాలను కలిగి ఉన్న వారిపై భారీ జారీమానాలను విధించుటయే గాక వారి షాపుల యొక్క లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *