సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రజలు తమ నిత్య అవసరాల కోసం విరివిగా ప్లాస్టిక్ వాడకం అనర్ధమని, అర్థరహితమైన ప్లాస్టిక్ అనారోగ్యమని, వాడవాడలా అవగాహనా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో మెప్మా, పిఆర్ఓ, సిఆర్పీ, మున్సిపల్ ఉద్యోగులు, సర్ సివి రామన్ స్కూల్ విద్యార్థులతో ప్లాస్టిక్ నిషేదంపై అవగహన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ .. ప్లాస్టిక్ ప్రాణ హాని తెలిసి కూడా ప్రజలు విపరీతంగా వినియోగించుకోవడం దారుణమని, ప్లాస్టిక్ ను నిషేధించి గుడ్డ సంచులనే వాడాలని అన్నారు. అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరావు మాట్లాడుతూ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలని, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం నడుంబిగించాలని, ప్లాస్టిక్ వాడకంపై నిర్దిష్టమైన నిబంధనలు పెట్టమని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. చెరుకువాడ రంగసాయి ప్లాస్టిక్ రహిత ప్రతిజ్ఞ నిర్వహించారు.
