సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్ పరిధిలో ప్లాస్టిక్ సంచుల, గ్లాస్ ల వాడకం కు , వ్యతిరేకంగా స్థానిక మునిసిపల్ అధికారులు పలు షాప్ లలో జరిపిన ఆకస్మిక తనిఖీ లలో ప్లాస్టిక్ వినియోగిస్తూ దొరికిన పలు షాప్ యజమానులుకు, రోడ్లపై వ్యాపారులఫై రైడ్ లో సుమారు 22,000 ఫైన్ వెయ్యడం జరిగింది. పట్టణంలో బలుసుమూడి తదితదితర సెంటర్స్ లో కూడా అధికారులు దాడులు నిర్వహించారు. స్థానిక మునిసిపల్ అసిస్టెంట్ కమిషనర్ అన్నీ వార్డుల శానిటేషన్ సెక్రటరీలకు మరియు అన్ని డివిజన్ల శానిటరీఇన్స్పెక్టర్ లకు చేసిన బహిరంగ విజ్ఞప్తి ఏమిటంటే.. శ్రీయుత పురపాలక సంఘం ప్రత్యేక అధికారి మరియు జాయింట్ కలెక్టర్ వారి ఆదేశాలు అనుసరించి నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల క్రయవిక్రయాలు జరుపుతున్న కమర్షియల్ దుకాణాల యాజమాన్యం వారికి మరియు ప్రజలకు ఈరోజు నుండి క్రమం తప్పకుండా ప్రతీ రోజు ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 1 గం వరకు మరియు సాయంత్రం 05.30 గం నుండి 7 గం ల వరకూ డివిజన్ల వారీగా టీమ్ లుగా వెళ్లి పెనాల్టీలు విధించాలని ఆదేశించారు. సదరు ఘన వ్యర్ధాల నిర్వహణ చట్టం-2016 ప్రకారం పెనాల్టీలు కట్టడానికి నిరాకరించిన వారి షాప్ లను షీజ్ చేయవలెను అలాగే ప్రతీ రోజు విధించిన పెనాల్టీల వివరాలను ఎప్పటికప్పుడు ఆఫీస్ వారికి తెలియజేయవలెనని ఆదేశాలు జారీ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *