సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మునిసిపల్ కమిషనర్ నేడు, శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో.. పట్టణ పరిధిలో గల పబ్లిక్ ప్రదేశములలో అనగా ఎలెక్ట్రికల్ పోల్స్, టెలిఫోన్ పోల్స్, డివైడెర్లు, ప్రభుత్వ ప్రహరీ గోడలు మరియు రైల్ ఓవర్ బ్రిడ్జ్ ప్రదేశములలో ఎటువంటి పోస్టర్స్, బేసర్లు మరియు సైన్ బోర్డ్స్, మొదలైనవి అతికించుట/ఏర్పాటు చేయుట నిషేదించడమైనది. కావున, పట్టణ పరిధిలో గల పబ్లిక్ ప్రదేశముల యందు పొలిటికల్ పార్టీలు మరియు ఇతరములకు సంబందించిన పోస్టర్స్, బేనర్లు మరియు సైన్ బోర్డ్స్, మొదలైనవి ది.19-01-2025 వ తేదీ లోగా తొలగించవలసినదిగా తెలియజేయడమైనది. అట్లు గాక, పబ్లిక్ ప్రదేశముల యందు పోస్టర్స్, బేనర్లు మరియు సైన్ బోర్డ్స్, మొదలైనవి అతికించినచో / తొలగించనిచో Defacement of Public Places Act అనుసరించి అపరాధ రుసుము రూ.2.00 లక్షలు వరకు వసూలు చేయుటయే కాక మరియు సంబందిత వారిపై కేసులు నమోదు చేయుటకు పోలీసు డిపార్ట్మెంట్ వారికి సిఫార్సు చేయబడునని ఇందుమూలముగా తెలియజేయడమైనది. మరియు పురపాలక సంఘ పట్టణ పరిధిలో ఎటువంటి ఫ్లెక్షీలు, బేనర్లు ప్రదర్శించినట్లయితే పురపాలక సంఘ అనుమతి పొందవలసినదిగా కోరడమైనది. లేని ఎడల చట్టపరమైన చర్యలు గైకొనబడునని ఇందుమూలముగా తెలియజేయడమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *