సిగ్మాతెలుగు డాట్, న్యూస్: చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా నేడు, సోమవారం తెలుగు దేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన బంద్ కు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ప్రెవేటు విద్య సంస్థలు మూసివేత తప్ప వ్యాపార సంస్థలు అన్ని యధావిధిగా తెరిచారు. ఉదయం నుండి కుండపోత గా కురుస్తున్న భారీ వర్షం మినహా ప్రజలకు వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఉదయం నుండి ఆర్టీసీ బస్సు సర్వీసులు కూడా యధావిధిగా నడుస్తున్నాయి. అయితే పట్టణంలో పోలీస్ వారి విజ్ఞప్తి మేరకు టీడీపీ జనసేన నేతలు వారివారి కీలక నేతలు వారి ఇండ్ల కే పరిమితమయ్యారు. అయితే మరి కొందరు నేతలు మాత్రంపార్టీ కార్యాలయాలలో నిరసన కార్యక్రమాలకు పరిమితమయ్యారు. బయట ఎటువంటి ధర్నాలు కు పాలబడలేదు. స్థానిక తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో నిరసన దీక్షలో ఉన్న టీడీపీ నేతలకు జనసేన నేతలు వచ్చి సంఘీభావం తెలిపి రాష్ట్రంలో జగన్ సర్కార్ ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని.. ప్రతిపక్ష నేత చంద్రబాబు ను అరెస్ట్ చెయ్యడం దారుణమని వచ్చే ఎన్నికలలో ప్రజలు వైసిపి సర్కార్ కు బుద్ది చెపుతారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి సుంకర రవి రామాయణం శ్రీనివాస్, దారపురెడ్డి త్రివిక్రమ్,అతికేళ అంజనేయ ప్రసాద్,చేన్ను రవి, ఉండవల్లి శ్రీనివాస్ , రవి, పాశం హరి, భగత్ సింగ్, మజ్జి నాని, అమరాపల్లి సతీష్ తదితర నాయకులు పాల్గొన్నారు..
