సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్రమైన బక్రీద్ పర్వదినాన్ని నేడు, సోమవారం భీమవరంలో వేలాది ముస్లిం సోదర సోదరీమణులు ఘనంగా నిర్వహించారు. స్థానిక పెద్ద మసీదు, ఈద్ గాహ్, లాంచీలరేవు లోని చినమసీదు, మెంటే వారి తోటలోని మసీదులలో నమాజులు చేసి అల్లా కు కృతఙ్ఞతలు తెలియజేసారు.( ఫై చిత్రం స్థానిక చిన మసీదులోనిది) దేవునికి ‘త్యాగం, ప్రేమ, సహనం వంటి సద్గుణాల సందేశమే బక్రీద్’ అని, నమ్మిన సిద్ధాంతం కోసం చివరికి ప్రాణ త్యాగానికి సిద్ధపడిన ఇబ్రహీమ్ జీవితం మనందరికీ ఆదర్శం. మంచి కోసం, ధర్మ సంస్థాపన కోసం ఈరోజు త్యాగోత్సవం జరుపుకొంటున్నట్లు స్థానిక ముస్లీమ్ పెద్దలు వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా మన సిగ్మా న్యూస్ వీక్షిస్తున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
