సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: కొత్త ఏడాది 2022 కు స్వాగతం పలుకుతూ భీమవరం పట్టణంలో రేపు శుక్రవారం రాత్రి 11 గంటలు దాటాక హడావిడి ఆర్భాటాలు ను పోలీస్ శాఖ నిషేదించింది. ప్రశాంత వాతావరణంలో వారి వారి ఇండ్లలో కుటుంబ సభ్యుల మధ్య తమ నివాసంలో అందరితో కలిసి ఆనందోత్సవాలతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని భీమవరం ఒకటో పట్టణం సీఐ కృష్ణ భగవాన్ అన్నారు. ఈ మేరకు ఆయన భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వారి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ .. మనకి ఇంకా కొవిడ్ ప్రమాదం ఇంకా పోలేదని ఇప్పటికే థర్డ్ వే వస్తుందని ప్రజానీకమంతా భయభ్రాంతులు చెందుతున్న నేపథ్యంలో మనమంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలని అన్నారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఏటువంటి వేడుకలు జరుపుకోరాదు అని. ఎక్కడైనా సౌండ్ సిస్టం లు, పెట్టీ ఎక్కడైనా అల్లర్లకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తమన్నరు. మద్యం మత్తులో వాహనాలు నడిపిన వాళ్ళ పై, త్రిబుల్ డ్రైవింగ్, మోటార్ సైకిల్ సైలెన్సర్ లు తీసి హడావిడి చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా రాత్రి 11 గం. దాటి బయటకు వచ్చి రోడ్లపై అనవసరంగా తిరిగిన వారిపై జరిమానా లతోపాటు కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా తల్లిదండ్రులకు మీ పిల్లలు ను రాత్రి సమయంలో బయటకు తిరక్కుండా జాగ్రత్తగా చూసుకోవాలని అని తెలిపారు. సి ఐ భగవాన్ అడ్వాన్స్ గా భీమవరం పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
