సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దీపావళి పండుగ అంటే ఆబాలగోపాలంలో ఇష్టం లేనిదెవరికి? దీపావళి పండుగ పూజలతో పాటు.. భీమవరంలో అయితే జిల్లాలోనే ఎక్కడ జరగనంత బాణాసంచా కాల్పులు ఇక్కడ జరుగుతాయి. ఇటీవల బాణాసంచా సామాను కంటే వాటి ధరలే బాగా పేలుతున్నాయి. దానితో సామాన్యులు కొంత దూరంగా ఉంటున్నారు. ఇంకా గత కరోనా సమయంలో కొంత దూకుడు తగ్గిన మాట వాస్తవం. అయితే మరోసారి దీపావళి బాణాసంచా అమ్మకాలకు స్వగతం పలుకుతూ భీమవరం లూధరన్ హై స్కూల్ లో గత 4 రోజులుగా భారీ స్థాయిలో సుమారు 30 కి పైగా బాణాసంచా షాపులు వెలిసాయి. మరో 3 రోజులలో దీపావళి .. మరిన్ని షాపులు నేడు, రేపు ప్రారంభిస్తారు. ఇక వాటికీ నెంబర్లు కేటాయింపు లు ఉంటాయి కదా! ఎప్పటి లాగే నెంబర్ 1 తో వరుణ సూపర్ బజార్ తన బాణాసంచా షాప్ ను ప్రారంభించింది. ఎన్నో దశాబ్దాలుగా అసలైన హోల్ సెల్ ధరలకు, నాణ్యత కు పేరెన్నిక కలిగిన మంచి కంపెనీ బ్రాండ్ల తో అమ్మకాలు ప్రారంభించింది. వినియోగదారులు మోసపోకుండా ముందుగానే సోషల్ మీడియా ద్వారా బాణాసంచా ఐటమ్స్ హోల్ సెల్ ధరలు ప్రచారం చెయ్యడం జరిగింది. బాణాసంచా వ్యాపారాలు అదృష్టం ఏమిటంటే గత నాలుగు రోజులుగా పెద్దగా వర్షం పడకపోవడం ఊపిరి పిలుచుకొంటున్నారు. మరో 2 రోజులు ఇలాగె ఉంటె.. ప్రజలు కూడా చక్కగా దీపావళి పండుగ ఎటువంటి ప్రమాదాలు లేకుండా జరుపుకొంటారుగా.. మరి..
