సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దీపావళి పండుగ అంటే ఆబాలగోపాలంలో ఇష్టం లేనిదెవరికి? దీపావళి పండుగ పూజలతో పాటు.. భీమవరంలో అయితే జిల్లాలోనే ఎక్కడ జరగనంత బాణాసంచా కాల్పులు ఇక్కడ జరుగుతాయి. ఇటీవల బాణాసంచా సామాను కంటే వాటి ధరలే బాగా పేలుతున్నాయి. దానితో సామాన్యులు బాణాసంచా కొనుగోళ్లు బాగా తగ్గించారు. మరో 6 రోజులలో దీపావళి.. మరి దివ్వెల పండుగ కు దీపావళి బాణాసంచా అమ్మకాలకు స్వగతం పలుకుతూ భీమవరం లూధరన్ హై స్కూల్ లో నేటి బుధవారం నుండి షాపులు ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం లైసెన్స్ ఉన్న 10 భారీ షాపులు సిద్ధం చేస్తుంటే మరో 3 రోజులలో దీపావళి 30 కి పైగా షాపులు ప్రారంభిస్తారు. వాటి భద్రతా ప్రమాణాలు ను ప్రభుత్వ అధికారులు పోలీస్ లు పర్యవేక్షిస్తున్నారు. ఇక వాటికీ ప్రత్యేక షాప్ నెంబర్లు కేటాయింపు లు ఉంటాయి కదా! అయితే .. వినియోగ దారులు నాసిరకం బాణాసంచాతో మోసపోకుండా ఎన్నో దశాబ్దాలుగా అసలైన హోల్ సెల్ ధరలకు, నాణ్యత కు పేరెన్నిక కలిగిన మంచి కంపెనీ బ్రాండ్ల తో అమ్మకాలు జరిపే బ్రాండ్ ఇమేజ్ ఉన్న ‘వరుణ సూపర్ బజార్’ తన బాణాసంచా ‘షాప్ నెంబర్ 4’ తో అమ్మకాలను ప్రారంభించడానికి సిద్దము ఉంది.ప్రజలు కూడా చక్కగా దీపావళి పండుగ ఎటువంటి ప్రమాదాలు లేకుండా ముందు జాగ్రత్తలతో పండుగ ఆస్వాదించాలి..
