సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో నేడు, శనివారం సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద మంజూరైన 3 లక్షల చెక్కును ఆసుపత్రి ఖర్చులకోసం లబ్ధిదారుడు బొర్రా రామచంద్ర రావు కుమారుడు వాసు కు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అందించడం జరిగింది. ఈ సందర్భముగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కష్టాలలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి సీఎం జగన్ ఎప్పుడు ముందుంటారని, అందులో ప్రజల ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ద వహిస్తారని , ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం గా ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *