సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్ ప్రభాస్ తాజా సినిమా ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచ వ్యాప్తంగా వేలాది థియేటర్స్ లో సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు.. సినిమా విడుదలయి నేటికి 4వ రోజు ఆదివారం కావడంతో అన్ని చోట్ల అడ్వాన్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది. ఇక భీమవరం అయితే ఇక చెప్పేది ఏమి ఉంది.. 11 థియేటర్స్ లో విడుదల అయ్యి కేవలం 3 రోజులలోనే 1కోటి 9 లక్షల రూపాయలు కలెక్షన్ కొల్లగొట్టింది. నేడు, ఆదివారం 4వ రోజు సైతం 7 థియేటర్స్ లో ప్రదర్శింప పడుతూ( వీటిలో 4 థియేటర్స్ 3డి స్క్రీన్స్) అన్ని ఆటలు అడ్వాన్స్ లో హౌస్ ఫుల్ అయ్యింది. దీనితో నేటి తో కలపి 4 రోజులకు 1 కోటి 34 లక్షల కలెక్షన్ పైగా వసూళ్లు సాధిస్తుంది. మొదటి వారం అవలీలగా కోటిన్నర పైగా కలెక్షన్ సాదిస్తుందని అంచనా.. గతంలో 15 థియేటర్స్ లో రిలీజ్ అయిన బాహుబలి 2 భీమవరం టౌన్ లో మొత్తం రన్ లో సాధించిన 3కోట్ల 39 లక్షల కలెక్షన్స్ రికార్డు కు ఈ కల్కి 2 ఎంత దగ్గరగా వెళుతుందో ? అని అభిమానులు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 4 రోజులకు కల్కి సుమారు 6 కోట్లు రూ . వసూళ్లు సాదిస్తుండటం గమనార్హం. .
