సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఎపి బిజెపి అధ్యక్షులు, పివిఎన్ మాధవ్, పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎంపీ పాకా సత్యనారాయణ లతో కలసి ముందుగా నేటి శుక్రవారం ఉదయం భారీగా కురిసిన వర్షం లో సైతం స్థానిక డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్ వద్ద ఛాయ్ పై చర్చ కార్యక్రమంలో స్థానిక వాకర్స్ తో పాల్గొన్నారు. వారి సూచనలు అభిప్రాయాలు పరిశీలిస్తానన్నారు. తదుపరి యూత్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలంగా బీజేపీ కి బలాన్ని జవసత్వాలు ఇస్తున్న నగరం భీమవరం అని, ఇక్కడ ప్రజలు అతిథి మర్యాదలుకు, వ్యాపార సమర్ధతకు పక్కరాష్ట్రాలలో కూడా భీమవరానికి మంచి పేరు ఉంది అన్నారు. భీమవరంలో అమృత పధకం, టిడికో ఇళ్ల పధకాలు వందల కోట్ల కేంద్రం నిధులతో అమలు చేసామన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ని ప్రధాని మోడీ సాధించిన విజయాలు తో మరింత బలోపేతం చేసే దిశగా ప్రతిష్టం చేస్తామని, ఈనెల 17న మోదీ జన్మదినం నేపథ్యంలో విజయవాడ విశ్వ బ్రాహణ సమితి ఆధ్వర్యంలో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వ విజయాలతో ప్రజలలోకి చేరేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని , ఇటీవల జీఎస్టీ సరళీకృత కారణంగా మధ్యతరగతి ప్రజలు కు మరింత ఊరట లభించిందని, అమెరికా బెదిరింపులకు బెదరం అని ట్రంప్ దిగివస్తున్నారని అన్నారు. ఇక బీజేపీ బలోపేతంలో భాగంగా ఇతర పార్టీల నుండి నేతలు వస్తే చేర్చుకొంటామని అయితే వారి గత నేరమయ రికార్డు కూడా పరిశీలించి నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. తదుపరి బీజేపీ జిల్లా శ్రేణులతో స్థానిక ఆనంద హల్ లో సమీక్ష సమావేశంలో మాధవ్ పాల్గొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *