సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నేడు గురువారం భీమవరంలో పర్యటించారు. ఆమె భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ నూతన కార్యాలయం ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మీడియా తో మాట్లాడుతూ.. ఏపీ బీజేపీ చరిత్రలో నేడు అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని చెప్పారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 24 పార్లమెంటు ఎన్నికల కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు.ఈ నర్సాపురం పార్లమెంట్ స్థానాన్ని 2 సార్లు బీజేపీ కైవసం చేసుకొంది అని ఈ జిల్లాలో ఎన్నో అపూర్వ విజయాలు బీజేపీ నమోదు చేసిందని అందుకే భీమవరంలో జిల్లా పార్టీ కార్యాలయం ను తాను స్వయంగా హాజరయి ప్రారంబిస్తున్నానని అన్నారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదని.. ఏ పార్టీలోనూ కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం ఉండదని తెలిపారు. ఏపీలో జనసేన తో ఇప్పటికి తమ పొత్తు కొనసాగుతుందని ఆమె అన్నారు.( మరి భీమవరంలోపోటీ చేసే ఉద్దేశ్యంతో ఉన్న పవన్ కళ్యాణ్ పోటీ నిలబడితే టీడీపీ తో పాటు బీజేపీ అభ్యర్థిని నిలబెట్టకుండా ఉంటుందా?) టీడీపీ తో పొత్తు విషయం దాటవేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ 350 సీట్లకు పైగా గెలుచుకుంటుందని అంచనా ఉందన్నారు. ఏపీలో లో నియంతృత్వం, విధ్వంసాలతో కూడిన పాలనను చూస్తున్నామని పురంధేశ్వరి అన్నారు. ఎవరైనా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతూ జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఏపీలో కొత్త అధ్యక్షురాలు వచ్చారని..ఇప్పుడు ప్రత్యేక హోదా అంటున్నారన్నారు మరి కాంగ్రెస్ కేంద్రంలో ఉన్నపుడు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదో ఆమె తెలపాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా సీఎం జగన్ ప్రకటిస్తూ.. స్టిక్కర్లు అంటించుకుంటున్నారని పురంధేశ్వరి విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *