సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నెల్లూరు జిల్లా కరరాలతిప్ప గ్రామానికి చెందిన పీతల మహేష్ అనే అంతర్ రాష్ట్ర ఘరానా దొంగను భీమవరం టూటౌన్ పోలీసులుగత బుధవారం అరెస్ట్ చేసారు. టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఆర్‌జి.జయసూర్య మాట్లాడుతూ..మాకు దొరికిన పీటల మహేష్ మోటారు బైక్ ల డిక్కీలలో దాసిన డబ్బులు కొట్టెయ్యడంలో నిష్ణాతుడు.. రాష్ట్రంలో ఎన్నో చోట్ల ఈ తరహా దొంగతనాలు చేసాడు. .గత 2023 ఆగస్ట్‌లో భీమవరం మండలం చిన అమిరం గ్రామానికి చెందిన అడ్డాల శ్రీనివాసరావు అతని స్నేహితునితో కలిసి భీమవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆస్తి లావాదేవీ అనంతరం కొంత డబ్బును ద్విబైక్ డిక్కీలో పెట్టుకుని బయలుదేరాడు. అక్కడ కాపుకాసిన పీటల మహేష్, అతని స్నేహితుడు బెంజిమెన్ శ్రీనివాసరావు వాహనాన్ని అనుసరించారు. . రాయలం రోడ్డులో కోళ్ల సీతా రాం ఇంటి వద్ద శ్రీనివాసరావు వాహనాన్ని పార్క్ చేసి లోపలికి వెళ్లాడు. దీనితో మహేష్, బెంజిమెన్ వాహన డిక్కీని బలవంతంగా తెరిచి దాదాపు రూ. 10 లక్షల సొమ్మును దొంగిలించారు. పీటల మహేష్ తన వాటాగా వచ్చిన రూ. 5 లక్షలలో రూ. 1.50 లక్షలను జల్సాలకు ఖర్చు పెట్టి మిగిలిన రూ. 3.50 లక్షల నగదు కారు కొనడానికి దాచాడు. ఈ నేపథ్యంలో బుధవారం వైజాగ్ బయలుదేరి భీమవరంలో దిగాడు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద మరొక దొంగతనం చేసి ఖరీదైన కారు కొనుగోలు చేయడానికి వచ్చినట్లు పోలీసులు పసిగట్టారు. టూ టౌన్ సీఐ కాళీచరణ్, ఎస్ ఐ ఇజ్రయెల్ ప్యూహాత్మకంగా ప్లాన్ చేసి మహేష్‌ను అరెస్ట్ చేసి రూ. 3.50 లక్షల నగదును రికవరీ చేసారని ( బెంజిమెన్ ఇంకా దొరకలేదు)అందుకు సహకరించిన పోలీస్ సిబ్బందిని అభినందించి వారికీ నగదు రివార్డ్ కూడా అందించారు.
