సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, శనివారం మధ్యాహ్నం భీమవరం బైపాస్ రోడ్డులో రైల్వే గేటు మొరాయించడంతో వాహనదారులు అందరు మెంటేవారి తోట అండర్ టర్నల్ స్ నుండి నుండి పిపి రోడ్డు మీద నుండి కొడవలి రోడ్డువైపు నుండి బైపాస్ వద్దకు చేరుకొన్న వాహనదారులు మరల చుట్టుతిరిగి ఓవర్ బిర్జ్ ఫై రావడంతో తీవ్ర ట్రాఫిక్ జాం అయ్యింది. ఇదే మధ్యాహ్నం సుమారు ఒంటిగంటన్నర సమయంలో ఒక భారీ ట్రాక్ లారీ వెనుక ఒక వాహనదారుడు ఓవర్ టెక్ చేస్తూ చక్రం క్రింద పడిపోవడంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాలువిరిగిపోయింది అని చూసినవారు చెపుతున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ స్తంభించింది. విచారణ నిమిత్తం పోలీసులు రావడం తో ట్రాఫిక్ నియంత్రించారు. బై పాస్ మీద నుండి ఓవర్ బిర్జ్ వరకు వచ్చిన వారు చాల మంది దేవుడా! అంటూ గునుపూడి వైపు మరిన్ని కిలో మీటర్లు దూరం ప్రయాణం మొదలు పెట్టారు. మొత్తానికి యాదృచ్చికంగాకొద్దీ సమయం భీమవరం టౌన్ కి 3 టౌన్ కి ప్రయాణ సంబంధాలు నిలిచిపోయాయని చెప్పవచ్చు.
