సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్’ త్రివిక్రమ్ శ్రీనివాస్ పర్యవేక్షణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ నటించిన ‘బ్రో’ సినిమా భారీ స్థాయిలో 11 తెరలపై ఉదయం 8గంటల ఆటలతో పవన్ అభిమానుల సందడి మధ్య ప్రారంభమయింది. ఈ రోజు మొత్తం 52 ఆటలు ప్రదర్శించడం విశేషం. దాదాపు అన్ని ఆటలు హౌస్ ఫుల్అవ్వడం విశేషం.. పట్టణంలో విజయలక్ష్మి థియేటర్స్, పద్మాలయా సెంటర్, రాయాలం తదితర ప్రాంతాలలో పవన్ అభిమానులు, జనసేన పార్టీ అభిమానులు భారీ స్థాయిలో కట్టిన ఫ్లెక్సీలు తో కొత్త శోభ కనపడింది. నర్సాపురం ఎం పీ రఘురామా కృష్ణంరాజు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.‘పవన్ కల్యా ణ్ సినిమా ‘బ్రో’ని ఇప్పు డే చూశా. ఈ ప్రపం చం లో ఎవరూ శాశ్వ తం కాదనే అంశంతో తెరకెక్కింది. మానవ జీవితాలను స్పృశిస్తుంది. పవన్ అభిమానులే కాదు ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిది. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్, త్రివిక్రమ్,ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు’’ అని పోస్ట్ చేసారు.
