సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరంలో భయంకర తుపాన్ గాలుల ప్రభావంతో నేటి మద్యాహ్నం నుండి ప్రజలు భయకంపితులు అవుతున్నారు. చెట్లు కూలుతున్నాయి. రేకు షెడ్డు లు లెగిసిపోతున్నాయి. నేటి మంగళవారం ఉదయం తెల్లవారు జాము ఆకాశం ఎర్రగా ఉన్న మబ్బులల్తో వర్షంతో భయం నెలకొల్పింది. నేటి మధ్యాహ్నం వంటి గంట నుండి సుమారు 2గంటల పాటు భారీ పెనుగాలులు విచిత్ర శబ్దాలతో ఆకాశం మబ్బులు కమ్ముకొని అలజడి రేపింది. విద్యుత్తూ సరఫరా పట్టణం అంతటా నిలచిపోయింది. అధికారులు ఫై నుండే విద్యుత్తూ సరఫరా ఆగిపోయిందని ఎప్పటికి వస్తుందో చెప్పలేమని తేల్చేసారు. ఎట్టకేలకు 5గంటల 40 నిమిషాలకు కేవలం 15 నిమిషాల విద్యుత్తూ సరఫరా వచ్చి నిలచిపోయింది. ప్రస్తుతము విద్యుత్తూ సరఫరా లేక ఇన్వెక్టర్స్ పని చెయ్యక పట్టణంలో అంధకారం నెలకొంది. చాల మంది వ్యాపారులు ఉదయం నుండి దుకాణాలు తెరవలేదు. తాజా సమాచారం ప్రకారం భీమవరం నుండి అంతర్వేది మధ్య సముద్రం అల్లకల్లోలంగా ఉంది.ఇప్పటికే మచిలీపట్నానికి కేవలం 100 కిమీ దూరం లోపే ఉన్న తుపాను నేటి రాత్రి 10 గంటల నుండి అర్ధరాత్రి వరకు తుపాను తీరం ఇక్కడ నుండే దాటే అవకాశం ఉంది. కాబ్బటి పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లాల ప్రజలు నేటి రాత్రి పూర్తీ అప్రమత్తముగా ఉండాలి. పెనుగాలులు 60 నుండి 100 కిలో మీటర్లు వేగంగా వీచే అవకాశం ఉంది. ప్రజలుప్రభుత్వ అధికారుల సూచనలు పాటించండి.
