సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణానికి తాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ..భవిషత్తు తరాలకు కూడా..రెండు పూటలా పుష్కలంగా తాగునీరు అందేలా తాగునీటి సరఫరా అభివృద్ధి పనులు చేయడం జరిగిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని 4వ వార్డులో అమృత్ ఫేజ్1లో నిర్మించిన 12 లక్షల (పూటకు) సామర్థ్యం గల ఓహెచ్ఐర్ (వాటర్ ట్యాంక్) ఆయను ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమృత పథకంలో పట్టణంలో 4వ వార్డు, దుర్గాపురం, బీసీ కాలనీల్లో ఓహెచ్ర్లు నిర్మాణం చేయడం జరిగిందన్నారు. వాటిలో 4వ వార్డులోని వాటర్ ట్యాంక్ను ముందుగా ప్రారంభించామని 11వ తేదిన దుర్గాపురం వాటర్ ట్యాంక్, బీసీ కాలనీ వాటర్ ట్యాంక్ను ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ 3 వాటర్ ట్యాంక్లను ఉపయోగించుకుని 2 పూటలా ఒకే సమయంలో పట్టణ ప్రజలకు పుష్కలంగా తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. జిల్లా కేంద్రం గా అభివృద్ధి చెందుతున్న భీమవరం పట్టణంలో భవిషత్తు లో పెరిగే జనాభా అవసరాలకు కూడా నీరు సరిపోయేలా తన హయాంలో ఏర్పాట్లు పూర్తీ చేశామన్నారు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్..
