సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, గురువారం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో వేలాది థియేటర్స్ లో సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందు అడుగుపెట్టిన బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించిన ‘వీరసింహా రెడ్డి’ బాలకృష్ణ అభిమానులకు నచ్చే మంచి మాస్ సంక్రాంతి సినిమాగా టాక్ సంపాదించుకొంది. భీమవరం లో నేడు, 9 థియేటర్స్ లో విడుదలయింది. ( సాయంత్రానికి షో లు సంఖ్యా తెలుస్తుంది) భారీ ఓపెనింగ్స్ సాధించింది.దర్శకుడు గోపీచంద్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ను బాగా హ్యాండిల్ చేసాడని, ఇంటర్ వెల్ ముందు 10 నిముషాలు ఒక రేంజ్ లో సినిమా ఉందని టాక్..యాక్షన్ సన్నివేశాలు అదుర్స్ అంటున్నారు. ఇక సెంకండ్ అఫ్ మాత్రం రొటీన్ పద్దతిలో సాగిన చివర క్లైమాక్స్ బాగా వచ్చిందంటున్నారు. ఇక శృతి హాసన్ ది చిన్నపాత్ర.. వరలక్ష్మి శరత్ కుమార్ రోల్ అదిరిపోయింది అంటున్నారు. ఇంకా విలన్ దునియా విజయ్ బాగా చేసాడని ప్రశంసలు వస్తున్నాయి. మొత్తానికి బాలయ్య అభిమానులను మాత్రం ఏ మాత్రం నిరాశపర్చని సినిమాగా ‘వీరసింహా రెడ్డి’ కలెక్షన్ రికార్డ్స్ లో బాగానే పే చేస్తోందంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *