సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, శనివారం ఉదయం నుండి వర్షం దోబూచులాడింది. ఒక్కసారిగా ఎండ మరు నిమిషంలో దట్టమైన మబ్బులుతో వర్షం.. ఇలా కొనసాగుతూ.. ఉదయం 11 గంటల నుండి ఏకబిగిగా మధ్యాహ్నం 1-30 వరకు భారీ వర్షం భారీ పిడుగులా మెరుపులా శబ్దాలతో కురిసింది. ఒక్కసారిగా భారీ కుంభ వృష్టి ఉరుములు పిడుగులా శబ్దాలతో కురవడంతో లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రోడ్డులు అన్ని జలమయం అయ్యాయి. నియోజక పరిధిలో పలు ప్రాంతాలలో కరెంట్ సరఫరా నిలచిపోయింది. పలు కరెంట్ ట్రాన్సుఫార్మ్స్ పాడయ్యాయి. పిడుగులు ఎక్కడ పడ్డాయో సమాచారం అందవలసి ఉంది.
