సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం భీమవరం కలెక్టర్ కార్యాలయంలో నరసాపురం పార్లమెంటరీ, కూటమిఉమ్మడి అభ్యర్థి బీజేపీ కి చెందిన భూపతి రాజు శ్రీనివాస్ వర్మ భారీ ర్యాలీగా వెళ్లి, ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ కు తన నామినేషన్ పత్రాల సెట్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ , జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి, చినబాబు మరియు రాష్ట్ర బిజెపి పరిశీలకులు అజిత్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భముగా శ్రీనివాస వర్మ మీడియాతో మాట్లాడుతూ.. నరసాపురం పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా వేలాదిమంది స్వచ్ఛందంగా తరలివచ్చి నాకు మద్దతు పలికారని పేర్కొన్నారు . జిల్లా నలుమూలల నుండి అనేకమంది కార్లు మోటార్ సైకిల్ తో ర్యాలీలో మధ్య మధ్యలో వచ్చి తనకు మద్దతు ఇచ్చి పాల్గొన్నారని చెప్పారు. ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంతం నుంచి విస్సాకోడేరు వంతెన వరకు జరిగిన ర్యాలీ తోనే తన విజయం ఖాయం అన్నారు. తన పరిధిలోని ఏడు అసెంబ్లీలో కూడా కూటమి అభ్యర్థులకు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు..ర్యాలీ ప్రారంభంలో శ్రీనివాస వర్మ కు ఎంపీ రఘురామా కృష్ణంరాజు, పులపర్తి అంజిబాబు తదితరులు సంఘీభావం తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *