సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కోస్తా ఆంధ్ర అంతటా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో.. భీమవరం లో నేటి బుధవారం మధ్యాహ్నం నుండి ఒక్కసారిగా ఆకాశం కారు చీకట్లు కమ్ముకొంటు వర్షం విరుచుకొని పడింది. నేటి రాత్రి వరకు కొనసాగుతూనే ఉండాలి. అల్ప పీడన ప్రభావం తో ఈ వర్షాలు మరో 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలకు జలమయం అవ్వడం నేపథ్యంలో స్థానిక మున్సిపల్ కమిషనర్, రామచంద్ర రెడ్డి ఆదేశాల మేరకు భారీ వర్షం కారణంగా పట్టణంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి వారి పిర్యదులు స్వీకరించడానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చెయ్యడం జరిగింది. ప్రజలు తమ సమస్యలను ఫోన్ నెంబర్ 08816 234284 కి తెలియజేస్తే అక్కడి సిబ్బంది తక్షణం స్వాందిస్తారని తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *