సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల రాజమండ్రి లో కల్తీ పాలు త్రాగి 5గురు మరణించడం తో పాటు చెయ్యని తప్పుకు ఎందరో అభాగ్యులు చావు బ్రతుకుల మధ్య ఇంకా కొట్టుమిట్లు ఆడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వివిధ పట్టణాలలో పుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు, గురువారం భీమవరంలో పలు షాపుల్లో మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్ సుందరరామిరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దీనిలో కొన్ని కేసులు నమోదు చేసారు. అయితే భీమవరం నడిబొడ్డున్న .పోలిస్ బొమ్మ సెంటర్ లో స్థానికులకు సుదీర్ఘ కాలంగా అమ్మకాలు నిర్వహిస్తున్న రాము గారి నెయ్యి షాపులో ఏకంగా సుమారు 1500 కేజీల వెన్న, 1500 కేజీల నెయ్యి నాణ్యత లేనివిగా అధికారులు గుర్తించారు. ఇటువంటి నిల్వ ఉన్న వినియోగానికి పనికిరాదని నిర్ధారించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ , షాపు ను సీజ్ చేసారు. తదుపరి చట్ట పరంగా చర్యలు ఉంటాయని కల్తీ పాలు వాటి అనుబంధ నెయ్యి, పెరుగు పన్నీరు వంటి కల్తీ, లేదా ఎక్కువ రోజులు నిల్వ ఉన్న పదార్ధాలు అమ్మితే ఆ వ్యాపారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
