సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీ వినాయక చవితి పర్వదినం సందర్భముగా జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో వాడవాడలా నేడు, సోమవారం స్థానిక యువత ఆధ్వర్యంలో వందలాది చవితి పందిళ్ళ సందడి కనిపించింది. ఈసారి ముహూర్తం ప్రకారం ఉదయం 11 నుండి పూజా సందడి ప్రతి ఇంటా ప్రారంభమయ్యింది. ఈసారి ఓ రేంజ్ లో భారీ స్థాయిలోఅందమైన పందిళ్లు వేసి పంచమ రాత్రులు, నవత్రులు, 11 రోజులు చప్పున వారి వారి అవకాశాలు బట్టి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా పట్టణంలో మెంటే వారి తోటలో, రెస్ట్ హౌస్ రోడ్డు , దుర్గాపురం లోను , గునుపూడి లోను దాదాపు ప్రతి 50 అడుగుల దూరానికి భారీ వినాయక్ విగ్రహాలతో ఆధ్యాత్మిక లో కూడా యువత పోటాపోటీగా శ్రీ వినాయక పందిళ్లు వెయ్యడం విశేషం. ఇక స్థానిక గన్నాబత్తుల వారి వీధి, మోటుపల్లి వారి వీధి ,సుంకర పదయ్యా వీధి, పంచా రామం వద్ద పరిసరాలలో కూడా విశేషముగా పందిళ్ళలో చక్కటి వినాయకులు 5 నుండి 8 అడుగుల వరకు భారీ విగ్రహ రూపాలలో పూజలు అందుకొంటున్నారు. ఇక 2 టౌన్, 3 టౌన్ లలో, అపార్ట్మెంట్స్ లో కూడా చక్కటి నిర్వహణ తీరుతో పలు చోట్లా శ్రీ వినాయక పందిళ్లు ఏర్పాటు చేసారు. శ్రీ శ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయ కళా వేదికపై శ్రీ భారీ గణేష్ ప్రతిమ ఏర్పాటు చేసి ఆవరణలో పందిరి వేసి అందమైన లైటింగ్ , సాంసృతిక కార్యక్రమాలతో నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఈ 11 రోజులు భీమవరంలో గణేష్ వేడుకలు తో నిత్యా పూజలు ,అన్న సమారాధనలు, విగ్రహ నిమర్జనలతో భారీ సందడి కానుంది.
