సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, శుక్రవారం వెంకట్రామా టాకీస్ సెంటర్ లో ఒక బట్టల దుకాణంలో పనిచేస్తున్న మహిళపై ఆమె భర్త నాగూర్ కత్తెరతో దాడి చేసి మెడ వద్ద తీవ్రంగా గాయపరచడంతో తీవ్ర రక్త స్రావం జరగటంతో ఇక్కడి వైద్యులు సలహాతో ఆమెను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ప్రాధమిక సమాచారం ప్రకారం స్థానిక మెంటే వారి తోటకు చెందిన నాగూర్ చాల కాలంగా దుకాణం లో పని మానెయ్యమని భార్యతో గొడవలు పడుతున్నాడని దానిలో భాగంగా ఆమె ఫై దాడి చేసాడని తెలుస్తుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తీ వివరాలు అధికారికంగా తెలియవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *