సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి గారి పెద్ద కార్యక్రమం సందర్భముగా భీమవరం లోని ఏర్పాటు చేసిన భారీ సంస్మరణ కార్యక్రమంలో బీజేపీ నేతలు, జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు హాజరు అయ్యి వర్మకు ఈ విషాద సమయంలో సంఘీభావం తెలుపుతూ ఆయన తండ్రి ఆత్మ కు ఘన నివాళ్లు అర్పించారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ వర్మ ఆహుతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. భీమవరంలో నా తండ్రి స్వర్గీయ భూపతిరాజు ‌సూర్యనారాయణ రాజు పేరిట ట్ర‌స్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.పార్లమెంటు సభ్యుడు గా వచ్చే బెనిఫిట్ కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి వినియోగిస్తానని తన తండ్రి ‌సం‌స్మరణ సభలో ప్రకటించారు. బిజెపి సాధారణ కార్యకర్త గా ప్రస్తానం ప్రారంభించి తండ్రి ప్రోత్సాహంతో ప్రధాని మోడీ, అమిత్ షా బీజేపీ పెద్దలు సహకారంతో ఈ కేంద్ర మంత్రి స్థాయికి చేరుకున్నాను అన్నారు. మా కుటుంబం స్వాతంత్ర్య సమరయోధులు కుటుంబం కావడంతో నా మార్గ నిర్దేశ్యనికి నా తండ్రి స్ఫూర్తిగా నిలిచారని తండ్రి ని తలుచుకుంటూ కంటతడి పెట్టారు. మననరసాపురం పార్లమెంట్ పరిధిలో తాను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కు సమయం కేటాయించి కూటమి కార్యకర్తలు గర్వ పడే విధంగా పని చేస్తానని హామీ ఇచ్చారు. నా వద్ద కు ఏపని ఉన్నా నేరుగా కలవవచ్చు అని హామీ ఇచ్చారు. జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం లో ప్రధాన రోడ్లకు, డయాలసిస్ సెంటర్ లు ఏర్పాటు చేయడానికి నిధులు తీసుకుని వచ్చానన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *