సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్వాతంత్ర సమరయోధులు భూ పోరాట ఉద్యమ నిర్మాతలు అన్నే దంపతుల త్యాగం స్ఫూర్తిదాయకమని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం అన్నారు స్వర్గీయ అన్నే అనసూయమ్మ 6 వ వర్ధంతి సభ భీమవరం మెంటే వారి తోట సుందరయ్య భవనం వద్ద జరిగింది ముందుగా అన్నే దంపతుల చిత్రపటానికి బి బలరాం పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో జన్మించిన అనసూయమ్మ ఏలూరు తాలూకాలో భూమి కూలీ కూలి పోరాటాలు నిర్వహించడంలో అన్నే దంపతుల పోరాట పటిమ త్యాగం మరువలేనీదన్నారు ఏలూరు తాలూకాలో లింగపాలెం టీ నర్సాపురం మండలాల్లో నిర్వహించిన భూ పోరాటాలు ఫలితం పేదలు భూములను అనుభవిస్తున్నారు వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కం శెట్టి సత్యనారాయణ ఒడుగు వెంకటేశ్వరరావు, నాగమణి , తదితరులు పాల్గొన్నారు.
