సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ప్రధాన పైప్ లైన్ మరమత్తులు నేపథ్యంలో నేడు, శనివారం వన్ టౌన్ మరియు 3 టౌన్ లలోని సుమారుగా 1నుండి 10 వ వార్డు మరియు 17 నుండి 28 వ వార్డు వరకు మంచినీటి సరఫరా ఉదయం సాయంత్రం 2పూటలా నిలిపివేయడం తో ప్రజలు మంచినీటికి ఇబ్బంది పడ్డారు. అయితే మునిసిపల్ కార్యాలయం నుండి గత రాత్రి 8-30 కు రావడం తో ఎక్కువ మంది ప్రజలకు సమాచారం అందకపోవడం వల్ల ( మన సిగ్మా వాట్స్ అప్ గ్రూప్ లలో పార్వర్డ్ చేసాము) పలు కుటుంబాలు మంచినీటి సమస్య ఎదురుకొన్నారు. కొందరు నీరు వస్తుందనుకొని మోటర్స్ ఆన్ చేసుకొని దానిలో గాలి చేరటంతో అటు బోరు వాటర్ కూడా రాక ఎలెక్ట్రిషియన్స్ కు పని చెప్పారు. దానికి తోడు ఉదయం 6 గంటలకు సాయంత్రం 6 గంటలకు కూడా భారీ వర్షం పడటం ప్రజలకు చాల ఇబ్బంది కలుగ జేసింది. రేపు ఆదివారం ఎటువంటి ఇబ్బంది లేకుండా కుళాయి నీరు వస్తుందని సమాచారం.
