సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో మాజీ మునిసిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత, జనసేన నేత గాదిరాజు వెంకట సత్య సుబ్రహ్మణ్యరాజు (తాతరాజు– 54) నేడు, గురువారం ఉదయం హైదరాబాద్ లో హాస్పటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇటీవల కొన్ని నెలల ముందు బైక్ ప్రమాదంలో గాయపడి కోలుకున్నారు. అయితే ఆరోగ్య సమస్యలుతో కొంతకాలంగా ఆయన భీమవరంలోని ఓ (ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం హైదరాబాద్ వెళ్లి 22న అక్కడ అసుపత్రిలో చేరారు. గురువారం తెల్లవారుజాము సమయంలో శాతరాజు తుదిశ్వాస విడిచారు. నేడు,గురువారం మధ్యాహ్నం తాతారాజు భౌతిక కాయాన్ని భీమవరం తీసుకు వచ్చారు. నిజానికి వైసీపీ లో దశాబ్దంన్నర పైగా కీలక నేతగా ఎదిగారు. భీమవరం మునిసిపల్ కౌన్సిల్ లో 5ఏళ్లపాటు పట్టణ ప్రజా సమస్యలపై పోరాటం చేసారు.పట్టణాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అందరితో ఆప్యాయంగా ఉంటూ రాజకీయాలకు అతీతంగా కల్మషం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన రాజకీయ ఎదుగుదలకు అడ్డంకి గా మారింది. కరోనా సమయంలో, పట్టణంలో వరదలు వచ్చినప్పుడు బాధితులకు ఉదారంగా సహకారం, ఆహార ఏర్పాట్లు చేసిన ధన్య జివి తాతారాజు. భీమవరం 2 టౌన్ వైసీపీ పార్టీ ఇంచార్జి గా రాజకీయాలు చెయ్యలేక పార్టీలో ఇమడలేక , పార్టీకి ద్రోహం చెయ్యలేక ఎంతో సతమతం అయ్యి, ఆఖరికి జనసేనలో అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిపోయారు. అసెంబ్లీ ఎన్నికలలో జనసేన విజయానికి తనవంతు కృషి చేసారు. తాతరాజును కడసారి చూసేందుకు ఆత్మీయులు, శాసనమండలి చైర్మెన్ మోషేను రాజు, ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపి తోట సీతారామలక్ష్మి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు,అధికసంఖ్యలో తరలివచ్చారు. తాతరాజు కుమారుడు ఆదిత్య బలుసు మూడిలోని మోక్షధామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మా ‘మంచి మిత్రులు’ తాతారాజు ఆత్మకు శాంతి కలగాలని ‘సిగ్మా న్యూస్’ తరపున వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము.
