సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని జిల్లా కలెక్టరేట్లో మంగళవారం రాష్ట్ర మంత్రి నాదేండ్ల మనోహర్ తన వ్యవసాయ శాఖకు సంబంధించిన పశ్చిమ, ఏలూరు జిల్లా అధికారులు రైస్ మిల్లర్లు, ఎమ్మెల్యేలు కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.మీడియాతో మాట్లాడుతూ.. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు , బొలిశెట్టి శ్రీనివాస్, ఆరమిల్లి రాధాకృష్ణ , జనసేన చిన్నబాబులతో కలిసి మాట్లాడారు. తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, ధాన్యం రైతులు తమకు కావలసిన చోట కొనుగోలు చేసుకునే విధంగా సదుపాయాలను ఏర్పాటు చేశామని, 48 గంటల్లోనే వారి సొమ్మును వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నామన్నారు.. రబీ ఖరీప్ లలో రాష్ట్రంలో 48 లక్షల 90 వేల టన్నుల వరి ధాన్యమును కొనుగోలు చేశామని, రూ 11వేల 400 కోట్లను 24 గంటల్లో రైతులు బ్యాంకు ఖాతాల్లో వేసామన్నారు. గత ప్రభుత్వం కంటే 11 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ధాన్యమును సేకరించామని పశ్చిమ గోదావరి జిల్లాలో 7 లక్షల 50 వేల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని, దానికి తగ్గట్టుగా 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమును కొనుగోలు చేసి రూ 1180 కోట్లను రైతులకు జమ చేశామని అన్నారు. ఏలూరు జిల్లాలో 3 లక్షల 53 వేల టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశామని, దానికి తగ్గట్టుగా 2 లక్షల 20వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశామని, రైతుల ఖాతాల్లో రూ 487 కోట్లు జమ చేసామన్నారు.మిల్లర్ల సమస్యలపై కూడా సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. చివరకు వాట్సప్ ద్వారా కూడా రైతులు స్వేచ్ఛగా ధాన్యం అమ్ముకునేందుకు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. . అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని రైతులకు 50శాతం సబ్సిడీతో టార్పాలిన్లను అందించనున్నామని మంత్రి మనోహర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *