సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేడు, భీమవరం పట్టణంలో పర్యటించారు. నేడు, శనివారం ఉదయం చినఅమిరం కూడలిలో గుంతలు లేని రోడ్లు ఏర్పాటుకు కొబ్బరికాయ కొట్టి పనులనుప్రారంభించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి , జనసేన చినబాబు, జిల్లా టీడీపీ అడ్జక్షులు మంతెన రామరాజు, మెంటే పార్ధసారధి, పాల్గొన్నారు. మంత్రి రవికుమార్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో రాష్ట్రంలో ఏ రోడ్డు చూసినా పెద్ద పెద్ద గోతులతో ప్రయాణానికి వీలులేని విధంగా దారుణంగా తయారయ్యాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రాగానే రోడ్లను అభివృద్ధి చేయడానికి లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగిందని అన్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు గుంతలను పూడ్చే మరమ్మత్తు పనులకు రూ 800 కోట్లు పైగా నిధులు మంజూరు చేయడం జరిగిందని, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ 1,699 లక్షల వ్యయంతో 7 నియోజక వర్గాల్లోని 74 రోడ్ల మరమ్మత్తులకు శ్రీకారం చుట్టడం జరిగిందని, రానున్న వారం రోజుల్లో రూ 3,125 లక్షల వ్యయంతో మరో 114 రోడ్లకు మరమ్మత్తులను సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేసే లక్ష్యంతో చేపట్టడం జరిగిందని తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా మెరుగైన రహదారి వ్యవస్థ ఉండాలని, కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంతో ప్రజలకు మెరుగైన పాలనా అందించడమే లక్ష్యంగా పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలతో పాటు , ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా రహదారులు భవనాల శాఖ అధికారి ఏ శ్రీనివాస్, డిఈ ఈ పివి రామరాజు, ఏఈ రాజశేఖర్, తాహసిల్దార్ రావి రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
