సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో నేడు , మంగళవారం రాత్రి ఏపీఆర్‌డీసీ చైర్మన్, నియోజకవర్గ పరిశీలకులు కనుమూరు సుబ్బరాజు (రాజబాబు) కలుసుకొని నియోజకవర్గ పరిధిలో రోడ్ల పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం నుండి అందవలసిన సహకారం ఫై చర్చించారు. ఈ సమావేశం అనంతరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ .. భీమవరం నియోజకవర్గంలో పలు చోట్ల నూతన రోడ్లు నిర్మించామని, మరికొన్ని రోడ్లకు మరమ్మతులు చేశామన్నారు. అయితే ఇంకా నియోజకవర్గంలోని పలు కీలక రహదారులు పనులు పూర్తీ చెయ్యవలసి ఉందని, నిధుల కొరత తో పెండింగ్‌లో ఉన్న పనులకు ప్రభుత్వ నిధులు మంజూరు చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సుబ్బరాజును కోరామని తెలిపారు
