సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం జేపీ రోడ్డులో నేడు, ఆదివారం ప్రముఖ మసాజ్ సెంటర్ ” గ్రెస్” లో వ్యభిచారం లో నిర్వహిస్తున్నారని కొద్దీ రోజులుగా జిల్లా ఎస్పీ రవి కుమార్ కు పిర్యాదులు రావడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు భీమవరం డిఎస్పి బండారు శ్రీనాథ్ పర్యవేక్షణలో నేడు, ఆదివారం గ్రే సెలూన్ మసాజ్ సెంటర్ పై భీమవరం టూ టౌన్ సీఐ గుత్తుల శ్రీనివాస్ మరియు వారి సిబ్బంది మసాజ్ సెంటర్ పై తనిఖీలు నిర్వహించారు. దానితో అక్కడ బయట ప్రాంతాల నుండి వచ్చిన 6గురు యువతులను, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. బయట మహిళకు మాత్రమే అనుమతి అని బోర్డు పెట్టినప్పటికీ నిబంధనలు విరుధంగా ఇక్కడ పురుషులు కూడా వస్తూ ప్రత్యకంగా ఏర్పాటు చేసిన గదులలో క్రాసింగ్ మసాజ్ లతో పాటు వ్యభిచారం కోసం వచ్చిన యువతులతో పాల్గొంటున్నారని ఆరోపణలపై, అసలు వాస్తవాలు ఫై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
