సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో స్కంద పురాణ విశిష్టత కలిగిన, సాక్షాతూ చంద్రుడు ప్రతిష్టించాడని భావించే రంగులు మారే శివలింగం ఉన్న పంచా రామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి దేవాలయంలో మహాశివరాత్రి నేపథ్యంలో జరుగుతున్నా శ్రీ స్వామివారి కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేలాది భక్తులు ప్రతిరోజు దేవేరులతో శ్రీ స్వామివారిని దర్శించుకొంటున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణ ల మధ్య భక్తుల విశేష సందడి నడుమ గత 5రోజుల పాటు నిర్వహిస్తున్న కళ్యాణా మహోత్సవాలు నేటి రాత్రి 7 -30 గంటల కు ప్రారంభమయ్యే తెప్పోత్సవానికి వేలాదిగా భక్తులు ఆబాల గోపాలం దేవాలయం వద్దకు చేరుకొన్నారు. వేలాదిగా వచ్చే భక్తుల కోసం పోలీస్ భద్రతా మధ్య తెప్పోత్సవం చంద్ర పుష్కరిణి లో నేటి రాత్రి 10 గంటల వరకు భారీ బాణాసంచా కాల్పుల మధ్య నిర్వహిస్తున్నారు. ఇదే తరహాలో దశాబ్దాలుగా పోటాపోటీగా నిర్వహిస్తున్న తెప్పోత్సవాన్ని స్థానిక 1200 ఏళ్లుగా ఉన్న పురాతన దేవాలయం శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో కూడా తెప్పోత్సవాన్నీ స్థానిక వీరమ్మ పార్క్ లోని ట్యాంక్ లో భారీగా ఏర్పాటు చేసారు. నేటి తో మహాశివరాత్రి 5 రోజుల వేడుకలు ముగియనున్నాయి.
