సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలోరాజకీయ సుపరిచితులు భీమవరంలో మాజీ వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసం, కార్యాలయాలపై నేటి బుధవారం ఉదయం నుండి ఐటి అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు. గ్రంధి శ్రీనివాస్ బంధువులు కు చెందిన ఉమ్మడి పశ్చిమ గోదావరి కృష్ణ జిల్లాలోని పలు ప్రాంతాలలో కూడా ఐటి అధికారులు ఒకేసారి రికార్డ్స్ సోదాలు చేస్తున్నట్లు వస్తున్నా వార్తలు సంచలనం రేపుతున్నాయి. అయితే భీమవరం లోని తన నివాసానికి ఐటి అధికారులు వచ్చినప్పుడు గ్రంధి శ్రీనివాస్ అక్కడ లేరని సమాచారం. ఏది ఏమైనా పూర్తీ సమాచారం తెలియవలసి ఉంది. ఇటీవల ఇటీవల ఎన్నికలలో ఓటమి తరువాత రాజకీయాలకు విరామం ప్రకటించిన గ్రంధి శ్రీనివాస్ వైసీపీని వదిలి టీడీపీ లో చేరతారని వార్తలు రావడం.. మరో ప్రక్క డెప్యూటీ సీఎం ,జనసేనాని పవన్ ఇటీవల జిల్లా కలెక్టర్ కు గతంలో పేదలకు భూములు పంపిణి కోసం కొనుగోలు చేసిన భూములకు అప్పటి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఎక్కువ ధరలు పెంచి కొనుగోలు చేసారని దానిపై దర్యాప్తు చేసి లొసుగులు తేల్చాలని పిర్యాదు చెయ్యడం గమనార్హం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *