సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవా సంస్ధ ఆధ్వర్యంలో భీమవరం టూటౌన్ లో వున్న చింతలపాటి బాపిరాజు మునిసిపల్ హై స్కూల్ లో మానవ అక్రమ రవాణా మరియు జాతీయ న్యాయ సేవాధికార సంస్ధ ప్రవేశ పెట్టిన జాగృతి పధకంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసారు. భీమవరం 2వ అదనపు జుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ N.జ్యోతి మాట్లాడుతూ.. ఇటీవల కొందరు దుండగులు మనపిల్లలకు మాయమాటలు చెప్పి అపహరణ చేసే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అనుమానం కలిగితే స్కూలు యాజమాన్యానికిగానీ, తల్లిదండ్రులకుగానీ, పోలీస్ వారికిగానీ తెలియజేస్తే చర్యలు తీసుకుంటారని, మానవ అక్రమ రవాణా చట్టరీత్యా నేరమని” అన్నారు.1వ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) P.హనీష మాట్లాడుతూ “విద్యార్ధి దశ నుండే చట్టాలపై పిల్లలు అవగాహన పెంపొందించుకోవాలని, తల్లి తండ్రులు, టీచర్స్ పిల్లలకు అపరిచితులు పట్ల ఎలా వ్యవహరించాలో చెప్పాలనిఅన్నారు..బార్ అసోసియేషన్ అధ్యక్షులు యేలేటి యోహాన్ (న్యూటన్) పిల్లలకు జనరల్ నాలెడ్జి ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్పిన విధ్యార్ధులకు న్యాయమూర్తుల చేతుల మీదుగా పుస్తకం, పెన్ను అందజేసారు. ఈ కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాదులు N.సుధీర్, M.B.భవాని, జాగృతి టీం సభ్యులు న్యాయవాదులు టూటౌన్ సబ్ ఇన్స్పెక్టర్ రామారావు, తదితరులు పాల్గొన్నారు.
