సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని మురుగు, సెప్టిక్ ట్యాంక్ కార్మికుల జీవన భద్రత, మెరుగైన ఉపాధి కల్పనే ధ్యేయంగా, భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ, పట్టణ గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ పథకం(నమస్తే) ఈ పైలట్ ప్రాజెక్ట్ అమలుకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో మరియు భీమవరం పురపాలక సంఘ అధికారుల ఆధ్వర్యంలో ఈ నెల ది.16.02.2024 ( రేపటి శుక్రవారం)తేదీన ఉదయం 10 గంటల నుండి 5 గం. వరకు భీమవరం పురపాలక సంఘ ఆఫీస్ నందు, భీమవరం పట్టణ పరిధిలో ఉన్న మలమురుగు, సెప్టిక్ టాంక్ శుభ్రపరిచే కార్మికుల గుర్తింపు నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇందుకుగాను మల,మురుగు శుభ్రపరచు కార్మికులు, సెప్టిక్ టాంక్ డ్రైవర్లు, హెల్పర్లుతో పాటు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా నిమగ్నమై ఉన్నవారు నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ పధకం ద్వారా వివరాలను నమోదు చేసుకొంటే వారి కుటుంబాలకు ఎన్నో రకాలుగా లబ్ది చేకూరుతుందని కావున సదరు సిబ్బంది వారి ఆధార్ మరియు గుర్తింపు కార్డులు తీసుకుని వచ్చి తప్పక వారి పేర్లు నమోదు చేసుకోవాలని భీమవరం మునిసిపల్ కమిషనర్ తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *