సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం 2వ వార్డు మెంటేవారి తోటలో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, సోమవారం ఉదయం ముస్లీమ్ లకు కమ్యూనిటీ మందిరం ( ఫంక్షన్ హాలు ) ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం లో పాల్గొన్నారు. దీనికోసం సీఎం జగన్ సహకారంతో ,సీఎం డీఎఫ్ నిధుల నుండి 15 లక్షల నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించారు, ఒక ప్రక్క వర్షం కురుస్తున్నప్పటికీ స్థానిక ముస్లీమ్ పెద్దలతో ఈ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మెంటే వారి తోట నుండి బై పాస్ రోడ్డు ను కలుపుతూ స్థానికుల సహకారంతో ఆక్రమణలు తొలగించి విశాలంగా నిర్మిస్తున్న రోడ్డు పనులు చివరి దశకు చేరుకొన్న నేపథ్యంలో ఆ పనులను కూడా పర్యవేక్షించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *