సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో .. వైయస్సార్ ఆసరా (డ్వాక్రా రుణమాఫీ) మూడో విడత పంపిణీ కార్యక్రమం నేడు, మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ..98 శాతానికి పైగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసిన ఘనత దేశంలో మన సీఎం జగన్ కి మాత్రమే దక్కిందని పేర్కొన్నారు. ప్రస్తుతం వైయస్సార్ ఆసరా పథకంలో మూడో విడత డ్వాక్రా మహిళలకు రుణమాఫీ పథకాన్ని అమలు చేయడం జరిగిందని తెలిపారు. మూడో విడతగా వీరవాసరం మండలానికి 11 కోట్ల 88 లక్షలు, భీమవరం మండలానికి 17 కోట్ల 85 లక్షలు, భీమవరం పట్టణానికి 10 కోట్ల 80 లక్షల నగదును డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందని. సుమారుగా ఒక్క భీమవరం నియోజకవర్గానికే మూడో విడత రుణమాఫీగా రూ 40 కోట్లు పైగానే నగదును ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా మహిళలకు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని అన్నారు. మూడో విడతగా భీమవరం పట్టణంలో రూ 10 కోట్ల 80 లక్షల మేర డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయడం జరిగిందని, అంతేకాకుండా రైతు రుణమాఫీ కూడా అమలు . ప్రస్తుతం తాడేరు వంతెన నిర్మాణానికి రెండు కోట్ల 30 లక్షల నిధులు మంజూరు అయ్యాయని, టెండర్ ప్రక్రియ కూడా ముగిసింది అని వచ్చే నెల మొదటి వారంలో శంకుస్థాపన చేసి వంతెన పనులను ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. అదే మాదిరిగా యనమదుర్రు డ్రైన్ పై నిర్మించిన వంతెనలకు అప్రోచ్ రోడ్ల నిమిత్తం రూ 36 కోట్ల నిధులను మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ శివరామకృష్ణ, ఏ ఏం సి చైర్మన్ కోటిపల్లి బాబు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, పట్టణ అధ్యక్షులు తోట భోగయ్య, నల్లం రాంబాబు, గాదిరాజు సుబ్రమణ్యం రాజు, కోడే యుగంధర్, వేండ్ర విజయదుర్గ, తదితరులు పాల్గొన్నారు.
