సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజక వర్గంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జగన్ సర్కార్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ఆర్ డి ఎస్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో నేడు, మంగళవారం మెగా జాబ్ మేళా జరిగింది. ఈ జాబ్ మేళాను ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం జగన్ కి నిరుద్యోగుల, వారి కుటుంబాల కష్టాలు పూర్తిగా తెలుసునని, అందుకే ఆయన అధికారం చేపట్టిన వెంటనే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా ప్రజలకు సేవ చేసే విధంగా వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి వారికి గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పరిశ్రమల స్థాపనలో కూడా స్థానికంగా 70 శాతం ఉద్యోగాలను కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అని అన్నారు. అయితే ఇక్కడ హాజరు అయినా నిరుద్యోగులు ఈ జాబ్ మేళాల లో ఉద్యోగాలు పొందాలనే తపనతో ఉండటం తనకు ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు. డిగ్రీలు చదివి, ఇంజనీరింగ్లు పూర్తిచేసి ఉద్యోగాలు లేక అనేకమంది ఇబ్బంది పడుతున్నారని, అటువంటి వారందరుకూడా ఈ మెగా జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహారాజు, తోట భోగయ్య, ఏఎస్ రాజు, గోపిశెట్టి సుబ్బారావు, స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అధికారి జీ కృష్ణారెడ్డి, డీఈవో మధుభూషణ్, సీడాప్ పార్థసారథి, ప్లేస్మెంట్ ఆఫీసర్ సిహెచ్ రమేష్, కాలేజీ ప్రిన్సిపల్ ప్రసూన తదితరులు పాల్గొన్నారు.
