సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం:ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా,ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటీవ్స్ యూనియన్ ల పిలుపు మేరకు భీమవరం శాఖ ఆధ్వర్యంలో నేడు, బుధవారం స్థానిక ప్రకాశం చౌక్ వద్ద సమ్మె శిబిరం నిర్వహించారు .యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ .శిరీష్ కుమార్ మాట్లాడుతూ.. మా సమ్మె ప్రధానంగా 8 డిమాండ్లు పై నిర్వహించామన్నారు. నిత్యావసర, అత్యవసర ఔషధంల ధరలు తగ్గించాలని, జియస్ టి పన్నులను ఔషధంలపై, వైద్య పరికరంలపై మినహాయించాలని, నాసిరకం మందులు అరికట్టాలని మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ లకు సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ చట్టం (1976) వర్తింపజేయాలని జీపిఆర్ యస్, ఇతర సాంకేతిక పని విధానాల ద్వారా మెడికల్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ కు పని భారం పెంచకుండా ఆపాలని online మందుల అమ్మకాలని నిలిపివెయ్యాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరియు పార్మా కంపెనీల యాజమాన్యాలను డిమాండ్ చేస్తున్నామన్నారు భీమవరం శాఖ కార్యదర్శి కె.యం సూర్యచంద్ర రాజు మాట్లాడుతూ ..సమ్మె విజయవంతం అయ్యిందని, భీమవరంలో ఉన్న మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ భారీ సంఖ్యలో పాల్గొన్నారని. మెడికల్ రిప్రజెంటేటివ్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని, పని విధానంనకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *