సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో మేరి దేశ్ మేరి మట్టి కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా పాల్గొనగా.. స్థానిక విద్యార్థులు 100 అడుగుల జాతీయ జెండా చేతబూని పట్టణ వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. మునిసిపల్ కమీషనర్ ఎం శ్యామల అధ్యక్షతన, విజ్ఞాన వేదిక.. రంగసాయి ఆధ్వర్యంలో నేడు, శనివారము ఉదయం జేపీ రోడ్డులోని 35 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహం వద్ద నుండి అంబేద్కర్ చౌక్ వరకు జాతీయ జండా తో జాతీయ సమైక్యత నినాదాలు చేస్తూ విద్యార్థుల ర్యాలి జరిగినది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ స్కూల్ సర్వీసోర్ ఎం సోమేశ్వరావు మరియు మునిసిపల్ స్కూల్ పిల్లలు మరియు ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్, మునిసిపల్ సిబ్బంది , సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *