సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, గురువారం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ రాకతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో స్థానిక ఉండి రోడ్డు, జేపీ రోడ్డులలో వాహనాల ట్రాఫిక్ కు ఇబ్బందులు ఏర్పడినప్పటికీ ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పని చేసారు.భీమవరం పట్టణ శివారు, పెదఅమిరo లోని రాధా కృష్ణా కళ్యాణ మండపం లో జరిగిన, రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, చిన్న కుమారుడు కొయ్యే చిట్టి రాజు IPS వివాహ వేడుక లో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయనతో కరచాలనం కు పెద్ద ఎత్తున కల్యాణ మండపంలో అభిమానులు పోటీ పడ్డారు.ఈ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబుతో సహా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన MLA లు MLC లు YSRCP నాయకులు తదితరులు పెద్ద పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఉదయం 11-30 గంటలకు హెలికాఫ్టర్ లో భీమవరం చేరుకొన్న జగన్ తిరిగి 12-10 కి హెలికాఫ్టర్ బయలు దేరగా స్థానిక జిల్లా నేతల వీడ్కోలు పలికారు స్థానిక. సుదీర్ఘ కాలం మిత్రులు మోషేను రాజు కు ఆయన కుటుంబానికి ‘సిగ్మా న్యూస్’ శుభాభినందనలు అందించింది.
