సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు,మంగళవారం భీమవరం శివారు లోని నరసాపురం ఎంపీ మరియు ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో కూటమి పార్టీల నేతలతో పాటు భీమవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు (అంజి బాబు) , టీడీపీ జిల్లా ప్రెసిడెంట్ , స్థానిక ఎమ్మెల్యే రామరాజు మరియు ఉండి నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. R R R అంటూ 3 భారీ ఆర్ లతో కూడిన కేకేలు ఏర్పాటు చేసి వాటిని ఆయనతో కట్ చేయించి శుభాబినందలూ తెలిపారు. రఘురామా మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాదులో స్థిరపడిన వారితో పాటు ఇతర ప్రాంతాలలోనూ స్థిరపడిన వారు సంక్రాంతి పండగకు సొంత ఊర్లకు వచ్చిన దాని కంటే మించి వచ్చారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఒక్క హైదరాబాదు నుంచే కాకుండా విదేశాలలో స్థిరపడిన వారు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో స్థిరపడినవారు కూడా తమ గ్రామాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. కేవలం ఒక్క హైదరాబాదు నుంచే 20 లక్షల మంది ఓటర్లు రాష్ట్రానికి తరలివచ్చారని, అందులో మహా అయితే పది నుంచి 20 వేల మంది వైకాపా కు పొరపాటున ఓటు వేసి ఉంటారన్నారు. మిగిలిన 19 లక్షల 80 వేల మంది తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమికి ఓటు వేశారన్నారు.
