సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రజక ఆత్మీయ సభను ఈనెల 23వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి నూజివీడు బస్టాండ్ దగ్గర రోటరీ క్లబ్ ప్రాంగణమునందు నిర్వహించటం జరుగుతుందని ఏపీ రజక వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్ తెలిపారు. భీమవరం పట్టణం 18 వ వార్డు ఆదిలక్ష్మి రజక విశ్రాంతి భవనమయందు స్థానిక రజక సంఘ సభ్యులను కలిసి కరపత్రాలను విడుదల చేసి రజక ఆత్మీయసభకు ఆహ్వానించారు. ఈసందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ..తెలుగుదేశంపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఆధ్వర్యంలో ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, గుంటూరు పశ్చిమ శాసన సభ్యురాలు గళ్ళ మాధవి, ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ సి.సావిత్రి మరియు వివిధ రజక ప్రముఖులు హాజరవుతున్నారని రజక ఆత్మీయసభకు పశ్చిమగోదావరి జిల్లా, నుండి అత్యధిక సంఖ్యలో రజక సోదరీ సోదరులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా ధోబి మహాసంగ్ ఉపాధ్యక్షుడు చింతాడ శ్రీనివాస్, ఆదిలక్ష్మి రజక సంఘం అధ్యక్ష కార్యదర్శులు కొత్తపల్లి వెంకటేశ్వరరావు నేదునూరి గంగాధర్ తిలక్ ఆల్ ఇండియా ధోబి మహాసంగ్ మీడియా కోఆర్డినేటర్ అమనాపు వెంకటేశ్వరరావు ఆదిత్య బాబి తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు
