సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు ఈ సంక్రాంతి సంబరాలకు భీమవరం వస్తున్నాని, ఇక్కడ తన కార్యాలయంలో తన శ్రేయోభిలాషులు తో సమావేశం అయ్యాక తన ఎంపీ పదవికి, వైసిపి సభ్యత్వ పదవికి అతిత్వరలో రాజీనామా చేస్తానని ప్రకటించడంతో ఈ చలికాలంలో మరల ఉపఎన్నికల రాజకీయ వేడి పుట్టింది. అన్ని చెప్పినట్లే జరిగితే... రఘురామా కృష్ణంరాజు ఉపఎన్నికలలో రాజధాని అమరావతి మాత్రమే ఉండాలని మన ప్రాంత వాసుల మద్దతు కోరుతూ, ఆదే ప్రధాన ఎజెండాగా.. ఎన్నికల బరిలో దిగబోతున్నారు. బహుముఖ పోటీ జరగకుండా ఓట్లు చీలకుండా ఆయన బహుశా బీజేపీ అబ్యర్ధిగా టీడీపీ, జనసేన మద్దతుతో ఎన్నికల బరిలో దిగే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ అగ్ర నేతలతో పాటు, చంద్రబాబు, లోకేష్ , పవన్ కల్యాణలతో ఆయన వుహ్యరచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ పార్టీల క్రింద స్థాయి క్యాడర్ దీనిని ఆమోదిస్తారా? అన్నది పెద్ద ప్రశ్న…ఇంకా కేవలం2ఏళ్ళు పైగా మాత్రమే అధికారంలో ఉండే ఈ ఎంపీ పదవి అయినప్పటికీ ఈ ఉపఎన్నికను రాష్ట్రంలో అధికార వైసిపి ఎంత ప్రతిష్టాకరంగా తీసుకొంటుందో అందరికి తెలుసు.. ఇక నరసాపురం ఎంపీ అబ్యర్ధిగా వైసిపి నుండి ఎవరు పోటీకి నిలబెడతారు? అన్నది కూడా భీమవరంలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే పలువురి ప్రముఖుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు భావిస్తున్నారు. వైసిపి కి మద్దతుగా నిలుస్తున్న గోకరాజు కుటుంబీకులతో పాటు, ప్రముఖ కాపు , బీసీ నేతల పేర్లు వినిపిస్తున్నాయి.. అయితే ఇటీవల తెలుగు దేశం పార్టీకి దూరంగా ఉంటున్న, మాజీ ఎమ్మెల్యే కూడా వైసిపి అభ్యర్థిగా నిలబడటానికి ఉత్సహం చూపుతున్నాడని, ఇప్పటి నుండే వైసిపి నేతలతో చొరవ చూపిస్తున్నాడని టాక్ నడుస్తుంది… అయితే ఇంకా సమయం ఉంది… ఎవరు వైసిపి అబ్యర్ధిగా పైనల్ సీఎం జగన్ మాత్రమే చేస్తారనేది ఉప ఎన్నికలు జరిగే సమయం బట్టి ఉంటుంది..
