సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతించిన వారి పేరిట సేవా కార్యక్రమాలను నిర్వహించడం గొప్ప విశేషమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పట్టణంలోని సుంకర పద్దయ్య వీధిలో రాట్నల సుబ్బలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేడు, బుధవారం రాట్నల సుబ్బలక్ష్మి వర్ధంతి సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంప్, మరియు శానిటరీ వర్కర్స్ కు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్ధసారధి, కలసి ప్రారంభించారు..నిర్వాహకులు చేస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ విజ్జురోతి రాఘవులు, మైలబత్తుల ఐజాక్ బాబు, రాట్నల సత్తిబాబుకూనపరెడ్డి సుబ్బారావు, కారుమూరి సత్యనారాయణ మూర్తి, కొండ్రు శ్రీనివాస్, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
