సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ఇకపై, పరిశుభ్రత, పరిశుధ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ మహా నగరాలూ తరహాలో పట్టణ ప్రధాన రహదారులపై రాత్రిపూటనే పారిశుధ్య పనివారు చెత్త చెదారాలు ఎత్తివేసే కార్యక్రమాన్నీ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నేటి శుక్రవారం రాత్రి మునిసిపల్ కమిషనర్ శివరామ కృష్ణ దగ్గరుండి పర్యవేక్షించి వారికీ తగిన సూచనలు ఇచ్చారు. రోడ్లపై చెత్త, వ్యర్ధాలు పడవేస్తున్న దుకాణదారులకు , మెడికల్ షాప్ యజమానులకు ఇకపై ఇలా చేస్తే సహించేది లేదని, తగిన చర్యలు, అపరాధ రుసుములు వాసులు చెయ్యడం జరుగుతుందని, చెత్తను ప్రక్కన పెట్టుకొని పారిశుధ్య పనివారు వచ్చినప్పుడు వారికీ అందజేసి సహకరించాలని విజ్ఞప్తి చేసారు. ఏది ఏమైనా రాత్రిళ్ళు మంచు పడుతున్న కమిషనర్ స్థాయి అధికారి ఇలా రోడ్లపై దగ్గరుండి పారిశుధ్య పనివారిని పర్యవేక్షించడం మంచి పరిణామమే..
