సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వికలాంగులు సకలంగులు కన్నా ప్రతిభ పాటవాల్లో ముందు ఉంటారని, అన్ని రంగాల్లో కూడా ముందు ఉండటం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెఫ్ అండ్ డమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి నెలలో జరిగే రాష్ట్రస్థాయి డెఫ్ అండ్ డమ్ (మూగ చెముడు) పోటీల పోస్టర్ ను భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నేడు, మంగళవారం ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించి మాట్లాడారు. అసోసియేషన్ నిర్వహించే పోటీలకు మా సహకారం ఉంటుందని అన్నారు.
