సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో నేడు, శనివారం రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి పర్యటించి పోలీస్ అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు. నేటి ఉదయం 9గంటలకు కి భీమవరం చేరుకొని స్థానిక విష్ణు పూర్ లోని బివి రాజు కాలేజీ లో గెస్ట్ హౌస్ కి చేరుకొన్న ఆయనకు ఏలూరు రేంజ్ ఐజీ పాలరాజు, జిల్లా ఎస్పీ రవిప్రకాష్ పుష్ప గుచ్చాలతో సాదర స్వాగతం పలికారు. కొద్దీ సేపు విరామం తరువాత బీవీ రాజు కళాశాల కాన్ఫరెన్స్ హాలులో రాష్ట్ర పోలీస్ బాస్’ డీజీపీ జిల్లా పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ లో ప్రస్తుతం జిల్లా రికార్డు ఏ విధంగా ఉంది అని వివరాలు అడిగి తెలుసుకొని కొన్ని సూచనలు చేసారు. అలాగే పట్టణాలలో ట్రాఫిక్ నియంత్రణ, మహిళలకు దిశా యాప్, వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేసేలా చర్యలు ఫై ఆయన వారితో సమీక్షా నిర్వహించారు. రాష్ట్ర పోలీస్ బాస్ పర్యటన సందర్భముగా ఉదయం 7 గంటల నుండి భీమవరం 2 టౌన్ లో అంబేద్కర్ సెంటర్ , బై పాస్ రోడ్డు, విష్ణు కాలేజీ వరకు భారీ పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేసారు.
